AP Stree Shakti Scheme 2025: మహిళలకు APSRTCలో ఉచిత బస్ ప్రయాణం – పూర్తి వివరాలు ఇక్కడ

 

AP Stree Shakti Scheme – APSRTC Free Bus Travel for Women & Transgenders


AP Stree Shakti Scheme – APSRTC Free Bus Travel for Women & Transgenders

పథకం వివరాలు

పథకం పేరు: స్త్రీ శక్తి (Stree Shakti Scheme)
ప్రారంభ తేదీ: 15 ఆగస్టు 2025
ప్రారంభించే వారు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
లబ్ధిదారులు: మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు
దరఖాస్తు విధానం: బస్సు ఎక్కిన తరువాత ప్రభుత్వ గుర్తింపు పత్రం (ఆధార్/ఓటర్ ఐడి/రేషన్ కార్డు) చూపించాలి
టికెట్ విధానం: Zero Ticket ( Zero Ticket Stree Shakti Scheme ) తప్పనిసరి
ప్రయోజనం: రాష్ట్రవ్యాప్తంగా APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం
అధికారిక వెబ్‌సైట్: www.apsrtconline.in


ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది

పల్లె వెలుగు
అల్ట్రా పల్లె వెలుగు
సిటీ ఆర్డినరీ
మెట్రో ఎక్స్‌ప్రెస్

ఎక్స్‌ప్రెస్ బస్సులు


ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు

డీలక్స్ / అల్ట్రా డీలక్స్
సూపర్ లగ్జరీ
నాన్‌స్టాప్ సర్వీసులు
ఇంటర్‌స్టేట్ సర్వీసులు
కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసులు
చార్టర్డ్ సర్వీసులు
ప్యాకేజీ టూర్స్
సప్తగిరి ఎక్స్‌ప్రెస్

స్టార్ లైనర్ మరియు అన్ని AC బస్సులు


Zero Ticket ఎలా పొందాలి

ముందుగా పథకం వర్తించే బస్సులను గుర్తించాలి.
బస్సు ఎక్కేముందు ప్రభుత్వ గుర్తింపు పత్రం (ఆధార్/ఓటర్ ఐడి/రేషన్ కార్డు) సిద్ధంగా ఉంచాలి.
బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ వద్ద నుండి Zero Ticket తప్పనిసరిగా తీసుకోవాలి.

Zero Ticket లేకుండా ప్రయాణిస్తే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.


ముఖ్య గమనిక

Zero Ticket తీసుకున్న తర్వాత మాత్రమే ప్రయాణం పూర్తిగా ఉచితంగా లెక్కవుతుంది. ఆధార్ కార్డు చూపించడం మాత్రమే సరిపోదు.