ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులకు ఉచిత త్రిచక్ర వాహనాలు – AP Subsidy Free Vehicle Scheme
AP Govt Free Three-Wheeler Scheme 2025 - రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ఒక్కో వాహనం విలువ సుమారు రూ. 1,30,000 ఉన్నప్పటికీ, అర్హులైన లబ్ధిదారులకు ఇది పూర్తిగా ఉచితంగా (100% Subsidy) అందుతుంది. ప్రతి నియోజకవర్గానికి 10 వాహనాలను కేటాయించగా, అందులో 50 శాతం వాహనాలు మహిళలకు రిజర్వ్ చేయడం విశేషం. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశమని ప్రభుత్వం పేర్కొంది.
అర్హతలు మరియు నిబంధనలు (AP Free Three-Wheeler Vehicle Scheme)
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కొన్ని నిర్దిష్ట అర్హతలు కలిగి ఉండాలి. ప్రధానంగా 70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు సదరం (SADAREM) సర్టిఫికెట్ ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండటం తప్పనిసరి. డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, వ్యవసాయ పనుల్లో ఉన్నవారు కూడా దీనికి అర్హులు.
అయితే, దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) ఉండాలి. గతంలో ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా వాహనం పొందిన వారు అనర్హులని, ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశమని అధికారులు స్పష్టం చేశారు.
దరఖాస్తు విధానం - చివరి తేదీ
Ap govt free three wheeler scheme 2025 registration - ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 25 చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apdascac.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, వైకల్య ధృవీకరణ పత్రం, 10వ తరగతి మార్కుల మెమో, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు గతంలో వాహనం తీసుకోలేదని సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి అధికారుల పరిశీలన అనంతరం ఎంపికైన లబ్ధిదారులకు సమాచారం అందుతుంది.
