కౌశలం 2025 సులభ గైడ్ | Kaushalam Registration Update
కౌశలం (Kaushalam) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న free job training & job opportunity ప్లాట్‌ఫారమ్. యువతకి పని దొరకడానికి అవసరమైన పరీక్షలు, కోర్సులు, జాబ్ రికమెండేషన్లు ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందిస్తారు.
Kaushalam Exam Update 2025
కౌశలం పరీక్షలు 02 DEC 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు రోజుకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఒక సచివాలయం లో రాయగలిగేలా పూర్తి ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.
- Morning & Afternoon – మొత్తం 2 స్లాట్స్ లో పరీక్ష నిర్వహణ
- రోజుకు ఒక సచివాలయం లో ఒకే సారి ఇద్దరు పరీక్ష రాస్తారు
- Headset & Camera సచివాలయంలోనే ఇస్తారు
కౌశలం పరీక్ష కోసం మొత్తం రెండు స్లాట్లు మాత్రమే నిర్ణయించబడ్డాయి. పరీక్ష సమయాలు కచ్చితంగా పాటించాలి:
ఉదయం 11:00 నుంచి 12:00 వరకు మరియు
మధ్యాహ్నం 3:00 నుంచి 4:00 వరకు.
పరీక్ష ప్రక్రియ సజావుగా సాగేందుకు అభ్యర్థులు సమయానికి హాజరు కావాలి.
కౌశలం అంటే ఏమిటి? | What is Kaushalam?
కౌశలం అనేది ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఉద్యోగ సహాయం ప్లాట్‌ఫారమ్. యువతకు ఉద్యోగం దొరకడానికి అవసరమైన skills నేర్పించడం, IT, ITES, GCC వంటి రంగాల్లో jobs వెతుకుతున్న వారికి సరైన training & assessment అందించడమే లక్ష్యం.
ఇక్కడ పరీక్షలు రాసి, కోర్సులు పూర్తి చేస్తే → సర్టిఫికేట్ వస్తుంది, దాని ఆధారంగా జాబ్ అవకాశాలు పెరుగుతాయి.
రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? | Registration Process
- మొదట అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://www.kaushalam.ap.gov.in
- Register → Graduates మీద క్లిక్ చేయండి
- మీ Aadhaar నంబర్ నమోదు చేయండి
- మీ మొబైల్ & ఈమెయిల్‌కి వచ్చిన OTPతో verify చేయండి
- లాగిన్ కోసం ఒక Password సెట్ చేయండి
లాగిన్ చేసిన తర్వాత ఏమి కనిపిస్తుంది? | Dashboard Details
కౌశలం డాష్‌బోర్డ్‌లో మీకు job journey మొత్తాన్ని ట్రాక్ చేయడానికి అవసరమైన అన్ని సెక్షన్లు ఉంటాయి.
- మీ వ్యక్తిగత వివరాలు (Profile)
- పరీక్షలు (Assessments)
- ఉద్యోగ సూచనలు (Job Recommendations)
- కోర్సులు (Courses)
- మీ Resume అప్లోడ్ & view ఆప్షన్
Readiness Survey | సులభ వివరణ
లాగిన్ తర్వాత ఒక చిన్న Readiness Survey ఉంటుంది. ఇందులో ప్రధానంగా మీ job readiness గురించి అడుగుతారు.
- తక్షణమే పని చేయగలరా?
- ఏ ప్రాంతంలో పని చేయాలనుకుంటున్నారు?
- ఎంత త్వరగా పని కావాలి?
ఈ సమాధానాల ఆధారంగా మీకు సరిపోయే ఉద్యోగాలు మరియు training సూచనలు ఇవ్వబడతాయి. అంటే ఇది జాబ్ వచ్చే అవకాశాలను పెంచే స్టెప్.
మీ ప్రొఫైల్ ఎలా భర్తీ చేయాలి?
ప్రొఫైల్‌లో మీరు తప్పనిసరిగా పెట్టాల్సిన వివరాలు ఇవి:
- మీ పేరు, చిరునామా
- విద్య వివరాలు
- మీకు ఉన్న అనుభవం
- సర్టిఫికేట్లు
- ప్రాజెక్టులు
48 గంటలు ముందు ఈ వివరాలు పూర్తిగా అప్డేట్ చేయాలి. ఆ తర్వాత ప్రొఫైల్ lock అవుతుంది, మార్పులు చేయలేరు.
పరీక్షలు ఎలా ఉంటాయి? | Assessments
| పరీక్ష పేరు | వ్యవధి | వివరణ |
|---|---|---|
| Skill Test | 45 min | గణితం, ఇంగ్లీష్, లాజిక్, కంప్యూటర్ questions |
| Communication Test | 15 min | ఇంగ్లీష్ మాట్లాడే పరీక్ష – 3 ప్రశ్నలు |
పరీక్ష నియమాలు
- పరీక్ష centerలో మాత్రమే రాయాలి
- Camera & microphone తప్పనిసరిగా ఆన్ ఉండాలి
- స్క్రీన్‌పై ఒకే ముఖం కనిపించాలి
- పరీక్ష సమయంలో tabs మార్చితే → పరీక్ష cancel అవుతుంది
సిస్టమ్ అవసరాలు (చాలా సింపుల్‌గా)
- ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్
- కనిష్టం 3 Mbps ఇంటర్నెట్
- Chrome లేదా Edge బ్రౌజర్
- Webcam + Mic
- నిశ్శబ్దమైన గది
“I’m Placed” అంటే ఏమిటి?
మీకు job వచ్చిన తర్వాత కౌశలం డాష్‌బోర్డ్‌లో మీ employment స్టేటస్‌ని update చేయడానికి “Mark My Employment” ఆప్షన్ ఉంటుంది.
- Dashboard → Mark My Employment క్లిక్ చేయండి
- Company పేరు నమోదు చేయండి
- పని పేరు (Designation) నమోదు చేయండి
- Offer Letter ను upload చేయండి
ఇలా once update చేసిన తర్వాత ఈ status 30 రోజులు lock అవుతుంది.
పాయింట్లు & సర్టిఫికేట్
| Activity | Points |
|---|---|
| Daily Login | 10 points |
| Course complete | 100 points |
| Assessment complete | 150 points |
పాయింట్లు కూడుకున్నకొద్దీ మీ ప్రొఫైల్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కోర్సు, పరీక్షలు పూర్తి అయిన తర్వాత Certificate share option ద్వారా మీ సర్టిఫికేట్‌ను షేర్ చేయొచ్చు.
జాగ్రత్తలు
- Kaushalam పూర్తిగా FREE – ఎవరికీ డబ్బులు ఇవ్వకండి
- Fake links, fake calls, third-party apps నుండి జాగ్రత్త
- Officials పంపే SMS/Email మాత్రమే నమ్మండి
సహాయం కావాలా?
కౌశలం ప్లాట్‌ఫారమ్ గురించి సందేహాలు ఉంటే లేదా technical help కావాలంటే అధికారిక హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.
Helpline Number: +91 78297 72255
Email: [email protected]

