పెట్టుబడి డబ్బులు రాకపోతే రైతులు వెంటనే ఈ చర్యలు తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నిన్న (ఆగస్టు 2) రైతులకు రూ.5,000 చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేసింది. అయితే, కొంతమంది రైతులకు ఇంకా డబ్బులు రాలేదని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డెలీ రావు వెల్లడించారు.
ఈ సమస్య ఉన్న రైతులు వెంటనే:
రైతు సేవా కేంద్రాల్లో తమ వివరాలు సమర్పించి, దరఖాస్తు చేయాలి
NPCI లింక్ కాని ఖాతాలున్నవారు బ్యాంకుకు వెళ్లి లింక్ చేయించాలి
E-KYC ప్రక్రియను పూర్తిచేయాలి
అన్ని వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే, రూ.5,000 రైతు పెట్టుబడి సాయం ఖాతాలోకి త్వరలో జమ అవుతుందని తెలిపారు.
Tags
annadata sukhibhava scheme 2025, NPCI not linked problem, annadata scheme money not credited
