Thalliki Vandanam – పిల్లలందరికీ ₹15,000 సాయం

 



తల్లి కి వందనం పథకం – ఆర్థిక కష్టాల మధ్య కూడా పూర్తి స్థాయిలో అమలు

ఆంధ్రప్రదేశ్‌లో తల్లి కి వందనం పథకం విజయవంతంగా అమలవుతోందని, లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని MSME & NRI వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఐదుగురు పిల్లలు ఉన్న కుటుంబానికి ఐదుగురికీ ఈ పథకం వర్తించడంతో కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందన్నారు.

గత ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఒక్క పిల్లవాడికి మాత్రమే వర్తింపజేసిందని,
ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అర్హత ఉన్న ప్రతి పిల్లవాడి తల్లికి ₹15,000 చొప్పున ఇవ్వడం ద్వారా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తోందన్నారు.

తాజా అభివృద్ధి:

ఆగస్టు 3న, విజయనగరం జిల్లా పుసపతిరేగలో కొత్తగా నిర్మించిన ప్రైమరీ పాఠశాలను
హోం మంత్రి వి. అనితతో కలిసి ప్రారంభించారు.

ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, NPCIL సంస్థ పాఠశాల నిర్మాణానికి అందించిన నిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇతర కార్పొరేట్ కంపెనీలు కూడా CSR నిధులను అభివృద్ధి పనులకు కేటాయించాలని కోరారు.


TAGS 

thalliki vandanam scheme ap, ₹15,000 scheme for mothers, thalliki vandanam latest news , thalliki vandanam news today