AP ఇంటి నుంచి పని – కొత్త సర్వే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Work From Home (WFH) New Survey 2025 ప్రారంభించింది. గతంలో వయస్సు ఆధారంగా అందరికీ సర్వే జరిపినా, ఈసారి విద్యార్హత కలిగినవారికే అవకాశం ఇవ్వనున్నారు.
పాత సర్వే ఎందుకు ఆగిపోయింది?
పాత WFH సర్వేలో 18–60 ఏళ్ళ మధ్య వయస్సున్నవారందరినీ చేర్చారు.
చాలా మందికి విద్యార్హతలు లేకపోవడంతో ప్రభుత్వానికి తగిన అవకాశాలు కల్పించలేకపోయారు.
అందుకే నూతన సర్వేలో విద్యార్హత ఆధారంగా మాత్రమే ఎంపిక చేయనున్నారు.
ఇప్పటి WFH సర్వేలో ఎవరికీ అవకాశం?
ప్రభుత్వ రికార్డుల్లో విద్యార్హతలు ఉన్నవారు మాత్రమే.
గ్రామ/వార్డు సచివాలయాల్లోని GSWS సిబ్బంది పేరు వచ్చినవారికే సర్వే చేస్తారు.పేరు లేని వారికి ఇప్పటికైతే అవకాశమే లేదు.
WFH సర్వేలో అడిగే ముఖ్యమైన సమాచారం:
మీరు పేరు వచ్చినవారైతే, ఈ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి:
1. ఆధార్ ద్వారా Face/OTP/Biometric Verification
2. మొబైల్ OTP
3. ఈమెయిల్ ID & OTP
4. విద్యార్హత సర్టిఫికెట్
5. పాస్ అయ్యిన సంవత్సరం
6. పర్సంటేజ్ / గ్రేడ్
7. ఏం చదివారు, ఎక్కడ చదివారు
8. తెలిసిన భాషలు (తెలుగు, ఇంగ్లీష్, హిందీ)
9. ఇతర విద్యార్హతలు ఉంటే అవి కూడా నమోదు చేయవచ్చు
సర్వే ఎలా జరుగుతుంది?
GSWS Employees App లో సర్వే చేయాల్సి ఉంటుంది.
కొత్తగా యాప్ డౌన్‌లోడ్ చేసి, లాగిన్ అయి, మీ క్లస్టర్ ఆధారంగా వ్యక్తులకు సర్వే నిర్వహిస్తారు.
మీరు పేరు చెప్పినా, Search by UID ద్వారా ఆధార్ నెంబర్ ద్వారా గుర్తించవచ్చు.
Face / Biometric / OTP ద్వారా వేరిఫై చేసి సర్వే ప్రారంభిస్తారు.
ప్రభుత్వ లక్ష్యం ఏమిటి?
సరిగ్గా అర్హులైన విద్యార్హత కలిగిన వ్యక్తుల వివరాలు సేకరించి, వారికి Work From Home అవకాశాలు కల్పించడం.
ఇంట్లో నుంచే ఉపాధి అవకాశాల కోసం సీరియస్‌గా సర్వే జరుపుతోంది
ఈ సర్వేలో పేరు వచ్చినవారు తప్పక పాల్గొనాలి. మీ డేటా నిఖార్సైనదిగా ఉండాలని సర్వే చేసే ఉద్యోగులు మరియు వ్యక్తులు రెండూ జాగ్రత్త పా
టించాలి. భవిష్యత్తులో మీరు ఇంటి నుంచే పని చేసే అవకాశం పొందాలంటే ఇదే మీ మొదటి అడుగు కావచ్చు!
