Correct Wrong Information in AP Smart Ration Card
AP Smart Ration Card Correction: How to Update Details
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, వాటిని సులభంగా సరిచేసుకోవచ్చు. సరైన వివరాలు ఉండటం భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం చాలా ముఖ్యం.
స్మార్ట్ రేషన్ కార్డులో ఈ వివరాలు ఉంటాయి: రేషన్ కార్డు రకం, నంబర్, కుటుంబ పెద్ద పేరు, వయసు, లింగం, కుటుంబ సభ్యుల పేర్లు, సంబంధం, రేషన్ షాపు ఐడీ, చిరునామా, తాసిల్దార్ కార్యాలయం, కుటుంబ పెద్ద ఫోటో మరియు QR కోడ్.
QR Code Details in New Smart Ration Card
QR కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వయసు, లింగం, సంబంధం, eKYC స్థితి, జిల్లా, మండలం, గ్రామం, రేషన్ షాపు నంబర్, పథకాల వివరాలు, రైస్ కార్డు నంబర్, సరుకుల వివరాలు మరియు బయోమెట్రిక్ డేటా వస్తాయి.
రేషన్ కార్డులో ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, మీరు మీ గ్రామం లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేయాలి. డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ సెక్రటరీ దరఖాస్తును స్వీకరిస్తారు.
దరఖాస్తు సమర్పించిన తర్వాత, డిజిటల్ అధికారి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. రసీదు అందిస్తారు. తర్వాత కుటుంబ సభ్యులు OTP, బయోమెట్రిక్ లేదా ఫేస్ ద్వారా eKYC పూర్తి చేయాలి. తాసిల్దార్ ఆమోదం 21 రోజుల్లో వస్తుంది.
Ration Card Details Change Service Name
ఈ సేవ “చేంజ్ ఆఫ్ డీటైల్స్ ఇన్ రైస్ కార్డ్” పేరుతో అందుబాటులో ఉంది. ఇందులో వయసు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, కుటుంబ సంబంధం మార్చుకోవచ్చు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్పు తప్పనిసరి.
దరఖాస్తుకు కావలసిన పత్రాలు: దరఖాస్తు ఫారం, కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కాపీ, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల కాపీలు, పుట్టిన తేదీ సర్టిఫికెట్ (10వ తరగతి సర్టిఫికెట్ లేదా ఆధార్), బంధుత్వం లేదా లింగం నిర్ధారణ పత్రాలు. దరఖాస్తు ఫీజు ₹24.
సరిచేసిన తర్వాత అప్‌డేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డు ఎలా పొందాలి? ప్రస్తువాత ప్రభుత్వం సెప్టెంబర్ లోపు పంపిణీ చేసే అవకాశం ఉంది. లేదా ఆన్‌లైన్ లేదా సచివాలయం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో ఖచ్చితమైన మార్గదర్శకాలు అందుబాటులోకి రానున్నాయి.
