AP Fee Reimbursement Verification Process 2025-26
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలేజీ విద్యార్థులకు ఇచ్చే ఉచిత ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే విద్యార్థులు తప్పనిసరిగా వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలి.
AP Fee Reimbursement Online Application 2025
ఈ వెరిఫికేషన్ చేయకపోతే ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్మెంట్ లభించదు. అలాంటి విద్యార్థులు సొంత డబ్బులతో కాలేజీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
AP Fee Reimbursement కోసం విద్యార్థులు ముందుగా తమ కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మొదటి సంవత్సరం చదువుతున్న వారు పూర్తి వివరాలు నమోదు చేయాలి. రెండో సంవత్సరం నుండి చదువుతున్న వారు గత సంవత్సరం నమోదు చేసిన వివరాలను ధృవీకరించి సబ్మిట్ చేయాలి.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రిన్సిపాల్ ఓటిఎ (OTA) ద్వారా ధృవీకరిస్తారు. ఈ రెండు దశలు పూర్తయిన తర్వాత మాత్రమే దరఖాస్తు సచివాలయానికి వెళుతుంది. ఈ రెండు దశలు పూర్తి చేయకుండా సచివాలయానికి వెళితే వెరిఫికేషన్ పూర్తి కాదు.
మొదటి సంవత్సరం విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో కింది పత్రాలు సమర్పించాలి. ర్యాంకు కార్డు, కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, గత సంవత్సరం పాస్ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, తల్లి బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ ఫారం.
రెండో సంవత్సరం నుండి చదువుతున్న వారికి గతంలో ఇచ్చిన వివరాలు సరిచూసుకొని సబ్మిట్ చేయడంతో సరిపోతుంది. తర్వాత ప్రిన్సిపాల్ ఓటిఎ ఆమోదం తర్వాత సచివాలయానికి వెళుతుంది.
AP Fee Reimbursement Eligibility Courses
గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చదువుతున్న వారందరూ ఈ పథకానికి అర్హులు. కానీ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్న వారు అనర్హులు. పదో తరగతి తర్వాత ఇంటర్, ఒకేషనల్ కోర్సులు మినహా ఇతర కోర్సుల్లో చదువుతున్న వారు కూడా అర్హులే.
రిజిస్ట్రేషన్, ఓటిఎ ఆమోదం తర్వాత దరఖాస్తు సచివాలయానికి వెళుతుంది. గ్రామంలో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డులో అయితే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు.
వెరిఫికేషన్ సమయంలో విద్యార్థి సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవసరమయ్యే పత్రాలను సమర్పించడం సరిపోతుంది. ఈ వెరిఫికేషన్ కు ఎలాంటి ఫీజు లేదు.
AP Fee Reimbursement Documents
అవసరమయ్యే పత్రాలు: అప్లికేషన్ ఫారం, విద్యార్థి ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, తల్లి బ్యాంక్ పాస్‌బుక్.
విద్యార్థులు తమ అప్లికేషన్ స్టేటస్ ను కాలేజీ ఐడి లేదా ఆధార్ నెంబర్ తో అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు. పెండింగ్, ఆమోదం, సచివాలయంలో వెరిఫికేషన్ స్టేటస్ అంతా అక్కడ చూడొచ్చు.
