e-Panta App 2025-26 Andhra Pradesh : రైతుల పంట వివరాలు డిజిటల్ గా నమోదు

 e-Panta App AP 2025: రైతుల పంట వివరాలు డిజిటల్ గా నమోదు





ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh Government ) రైతుల సంక్షేమం కోసం e-Panta App ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ పంట బుకింగ్ సిస్టం ( Digital Crop Booking System ) ద్వారా ప్రతి పొలంలో వేసిన పంట వివరాలు వెబ్ ల్యాండ్ రికార్డ్ ( web Land Record ) లో నమోదవుతాయి. దీనితో పంట బీమా, కనీస మద్దతు ధర కొనుగోలు, వడ్డీ లేని రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీలు సకాలంలో అందుతాయి.


2025-26 సీజన్ లో జియో-ట్యాగింగ్ ( Geo Tagging ), క్లస్టర్ మాపింగ్ ( Cluster Mapping ) , ఫోటో తప్పనిసరి వంటి కొత్త ఫీచర్లు చేర్చారు. యజమాని రైతులు, కౌలు రైతులిద్దరికీ ఈ సిస్టం అందుబాటులో ఉంటుంది. రైతు ఈ-కేవైసీ ద్వారా డేటా ఖచ్చితత్వం సాధిస్తారు. పంట బుకింగ్ కు యజమానులు ఆధార్ కార్డు, 1B రికార్డ్ ఇవ్వాలి ( 1B Land Records ). కౌలు రైతులు తమ ఆధార్, యజమాని 1B రికార్డ్ సమర్పించాలి. ఫోటో, జియో-కోఆర్డినేట్స్, సాగు పద్ధతి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.


RSK సిబ్బంది గ్రామస్థాయిలో డేటా ధృవీకరణ చేస్తారు. పొలంలో పంట ఉంటే బుకింగ్, లేకపోతే ఫాలో బుకింగ్ చేస్తారు. ఫీల్డ్ లో స్పష్టమైన ఫోటోలు, GPS ఆన్ చేసి జియో-ఫెన్స్ లోపల ఉండి డేటా నమోదు చేయాలి. MAO, DAO, కలెక్టర్ లాంటి అధికారులు సూపర్వైజరీ చెక్ నిర్వహిస్తారు. డ్రాఫ్ట్ లిస్ట్ ను గ్రామ సభలో చదివి వినిపించి, అభ్యంతరాలు సేకరించి సరిచేస్తారు. చివరికి ఫైనల్ లిస్ట్ ప్రచురిస్తారు.


kharif 2025 కు పంట బుకింగ్ సెప్టెంబర్ 15 లోపు, సోషల్ ఆడిట్ సెప్టెంబర్ 19-24, అభ్యంతర పరిష్కారం 25-28, ఫైనల్ లిస్ట్ సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలి. e-Panta ద్వారా రైతులకు డిజిటల్ పారదర్శకత కలుగుతుంది. ప్రతి పొలం వివరాలు ఖచ్చితంగా నమోదు కావడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరతాయి.