Upadi Hami Pathakam AP: 2005లో అమలులోకి వచ్చిన ఈ ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం.. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు సంవత్సరంలో కనీసం 100 రోజుల గిరాకీ పని (manual labour) కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం.
పథకానికి అర్హతలు, కావాల్సిన పత్రాలు ఈ పథకంలో చేరడానికి కొన్ని అర్హతలు తప్పనిసరి. దరఖాస్తుదారులు భారతీయ పౌరులై, గ్రామీణ ప్రాంతానికి చెందినవారై ఉండాలి. కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అర్హులు. అలాగే, కుటుంబ వార్షిక ఆదాయం నిర్ధారిత పరిమితికి లోబడి ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు (లేదా EPIC), బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, మరియు మొబైల్ నంబర్ వంటి పత్రాలు అవసరమవుతాయి.
ఆన్‌లైన్‌లో పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం ఎలా?
ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. కింది పద్ధతిని అనుసరించడం ద్వారా మీ స్టేటస్ తెలుసుకోండి:
ముందుగా, పేమెంట్ స్టేటస్ కోసం కేటాయించిన అధికారిక లింక్‌పై క్లిక్ చేయాలి. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత, మొదటగా మీ జిల్లాను ఎంచుకోవాలి. ఆ తర్వాతి దశలో మీ మండలం, ఆపై మీ పంచాయతీ వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి.
అనంతరం, అక్కడ కనిపించే "Employement Register Option" లేదా "Jobs card option" పై క్లిక్ చేయాలి. చివరిగా, మీ జాబ్ కార్డ్ నెంబర్ లేదా మీ పేరును ఎంచుకోవడం ద్వారా మీ ఉపాధి హామీ చెల్లింపుల పూర్తి వివరాలను మీరు తెలుసుకోవచ్చు.
