APSRTC Recruitment 2025: పదో తరగతి అర్హతతో ఆర్టీసీలో ఉద్యోగాలు

APSRTC Recruitment 2025



APSRTC రిక్రూట్‌మెంట్ 2025: 277 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

Apsrtc recruitment 2025 277 notification: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 277 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జిల్లాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. కడపలో 60, అనంతపురంలో 50, కర్నూలులో 46, అన్నమయ్య జిల్లాలో 44, నంద్యాలలో 43, మరియు శ్రీ సత్యసాయి జిల్లాలో 34 పోస్టులు ఉన్నాయి. ఈ అవకాశంతో అభ్యర్థులు APSRTC వర్క్‌షాప్‌లలో శిక్షణ పొందుతూ ప్రభుత్వ రంగంలో అనుభవం సంపాదించవచ్చు.


ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.


అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మెరిట్ లిస్ట్, ఫైనల్ సెలక్షన్, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజుగా రూ. 118 చెల్లించాల్సి ఉంటుంది.


ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్ (NAPS) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 25, 2025న ప్రారంభమైన ఈ దరఖాస్తు ప్రక్రియకు నవంబర్ 8, 2025 చివరి తేదీగా నిర్ణయించారు.


Apsrtc recruitment 2025 277 apply online

Apsrtc recruitment 2025 277 notification pdf download