AP లో పేదల గుర్తింపుకు మరో సర్వే – AP P4 Need Assessment Survey 2025 ప్రారంభం

 

P4 Need Assessment Survey

ఏమిటి ఈ AP P4 Need Assessment Survey? మీకు అవసరమయ్యే అన్నీ వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో పేద ప్రజలకు మరింత నిఖార్సైన సేవలు అందించేందుకు P4 Need Assessment Survey 2025 ను ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలను గుర్తించి, వారికి సహాయపడే మార్గదర్శి (Margadarshi) లు, మరియు సహాయం పొందే బంగారు కుటుంబాలు (Bangaru Kutumbam) గా గుర్తించడం జరుగుతుంది.

P4 అంటే ఏమిటి?
P4 = Public, Private, People Partnership
ఇది ప్రభుత్వం, దాతలు, ప్రజల మధ్య భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఓ వినూత్న పాలసీ.


P4 సర్వే ముఖ్యాంశాలు:

 సర్వే ప్రారంభ తేదీ: జూలై 20, 2025
 చేసేది: గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది
 P4 App ద్వారా సర్వే
 Login: ఉద్యోగి ఆధార్‌తో
 Default Password: 1234 (తర్వాత మార్చాలి)
 పరిచయం లేకపోతే: కొత్తగా కుటుంబాన్ని యాప్‌లో జోడించే అవకాశం ఉంది


బంగారు కుటుంబంగా అర్హత పొందాలంటే:

ఈ క్రింది సమస్యల్లో కనీసం ఒక్కటి ఉన్న కుటుంబం అర్హత పొందవచ్చు:

ఎల్పీజీ లేని సంప్రదాయ ఇంధనం వాడే కుటుంబం
ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేని వారు
ఆదాయం లేని కుటుంబం
శుద్ధ తాగునీరు 30 నిమిషాల దూరం లోనే లభించని కుటుంబం
బ్యాంక్ ఖాతా లేని కుటుంబం


అర్హత లేనివారు ఎవరు? (Ineligibility):

5 ఎకరాల భూమి / >2 ఎకరాల తడిబడి భూమి
ప్రభుత్వ ఉద్యోగం
మున్సిపల్ ప్రాంతాల్లో ప్రాపర్టీ కలిగి ఉండటం
ఆదాయపు పన్ను చెల్లింపు
Four-wheeler వాహనం కలిగి ఉండటం
నెలకు >200 యూనిట్లు విద్యుత్ వినియోగం


P4 App లో సర్వేలో అడిగే ప్రశ్నలలో ముఖ్యమైనవి:

కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయం, జీవన స్థితి
ప్రభుత్వం నుండి పొందుతున్న పథకాలు
నెలవారీ ఖర్చు
ఏవైనా ప్రత్యేక సహాయాలు అవసరమా?
మీకు అవసరమైన సహాయం ఏమిటో ఆడియో రూపంలో తెలిపే అవకాశం


ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది?

 ప్రభుత్వ పథకాల పరిధిలోకి రావచ్చు
 Skill training, livelihood support పొందే అవకాశం
 బంగారు కుటుంబంగా గుర్తింపు పొందగలగడం